Ashes Series | సిడ్నీ: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే చారిత్రక యాషెస్ టెస్టు సిరీస్ తదుపరి ఎడిషన్ (2025-26)కు సంబంధించిన షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది. వచ్చే ఏడాది నవంబర్ 21 నుంచి జనవరి 8 దాకా ఈ సిరీస్ జరుగనుంది. నవంబర్ 21-25న జరిగే తొలి టెస్టుకు పెర్త్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. యాషెస్ టెస్టు సిరీస్ ప్రారంభ మ్యాచ్‌కు వేదికగా వ్యవహరించనుండటం పెర్త్‌కు నాలుగు దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమం. గబ్బా (రెండో), అడిలైడ్(మూడో), మెల్బోర్న్ (నాల్గో), సిడ్నీ(ఐదో) సిరీస్‌కు ఆతిథ్యమిస్తున్నాయి.