యూఎస్ ఓపెన్: టాప్ సీడ్ అరీనా సబలెంక (బెలారస్) వరుసగా రెండో సారి యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియం వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో సబలెంక.. 6-3, 7-6 (7/2)తో అమెరికా యువ సంచలనం ఎమ్మా నవరోను ఓడించింది.
ఫైనల్లో ఆమె యూఎస్ఏకే చెందిన జెస్సిక పెగులాతో తాడో పేడో తేల్చుకోనుంది. మరో సెమీస్‌లో ఆరో సీడ్ జెస్సిక.. 1-6, 6-4, 6-2తో కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తుచేసి తొలిసారి ఈ టోర్నీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.