హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియా స్కూల్స్ ఆన్లైన్ చెస్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ ప్లేయర్ బాతుల ఆరుశ్ రజత పతకంతో మెరిశాడు. ఫిలిప్పీన్స్ జాతీయ చెస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన టోర్నీ అండర్-7 విభాగంలో ఆరుశ్ అదరగొట్టాడు. 25 ఆసియా దేశాల నుంచి పోటీపడ్డ టోర్నీలో ఈ తెలంగాణ బుడతడు మొత్తం తొమ్మిది గేమ్‌లలో ఏడు విజయాలు ఒక డ్రాతో 7.5 పాయింట్లు దక్కించుకున్నాడు.