Arun Karthik : టీ 20లీగ్ అంటే చాలు.. బ్యాటర్లు పూనకం వచ్చినట్టు ఆడతారు. బౌలర్లను ఉతికారేస్తూ పరుగుల వరద పారిస్తారు. ఐపీఎల్ 16వ సీజన్లో శుభ్‌మన్ గిల్(Shubhman Gill), విరాట్ కోహ్లీ(Virat Kohli) విధ్వంసక శతకాలు బాదడం చూశాం. ఇప్పుడు తమిళనాడు ప్రీమియర్ లీగ్(Tamil Nadu Premier League)లో అరుణ్ కార్తిక్(Arun Karthik) మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. నెల్లాయ్ రాయల్ కింగ్స్(Nellai Royal Kings) తరఫున ఆడుతున్న
ఈ చిచ్చరపిడుగు చెపాక్ సూపర్ గిల్లీస్(Chepauk Super Gillies)పై శతకం(104 నాటౌట్)తో మెరిశాడు. దాంతో, ఈ లీగ్‌లో మూడు సార్లు వంద కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో నెల్లాయ్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అరుణ్ కార్తిక్, విరాట్ కోహ్లీ
అరుణ్ కార్తిక్ 2008లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆరంగేట్రం చేశాడు. కుడి చేతివాటం బ్యాటర్ అయిన అతను లెగ్ స్పిన్నర్ కూడా. తమిళనాడు తరఫున 2009-10 రంజీ సీజన్లో అరుణ్ అద్భుతంగా ఆడాడు. 53.19 సగుటుతో 573 పరుగులు చేశాడు. దాంతో, ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు వేలంలో అతడిని కొనుగోలు చేసింది. 2011 -13 సీజన్లలో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే.. 2014 వేలంలో అరుణ్‌ను కొనేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు.