IND vs SA : టీ20ల్లో వికెట్ల వేట కొనసాగిస్తున్న భారత అర్ష్‌దీప్ సింగ్ (2-14) దక్షిణాఫ్రికాపై చెలరేగిపోతున్నాడు. భారీ ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు షాకిస్తూ రెండు వికెట్లు తీశాడీ యంగ్‌స్టర్. ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ క్వింటన్ డికాక్(0)ను డకౌట్ చేశాడీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. తన రెండో ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్(14)ను పెవిలియన్ పంపాడీ సింగ్. పవర్ ప్లే చివరి ఓవర్ తొలి బంతికే మర్క్రమ్(14)ను బౌల్డ్ చేసి బ్రేకిచ్చాడు అక్షర్ పటేల్.
కటక్ బరాబతి స్టేడియంలో భారీ స్కోర్ చేసిన భారత జట్టు.. ప్రత్యర్ధిని వణికిస్తోంది. తొలి ఓవర్లోనే వికెట్ తీసిన పేసర్ అర్ష్‌దీప్ సింగ్(2-14).. తన రెండో ఓవర్లోనూ వికెట్ అందించాడు. ఫామ్‌లో ఉన్న క్వింటన్ డికాక్(0)ను డకౌట్ చేశాడు అర్ష్‌దీప్. డికాక్ ఆడిన బంతి ఎడ్జ్ తీసుకోగా స్లిప్‌లో అభిషేక్ క్యాచ్ అందుకున్నాడు. అనంతరం రెండు ఫోర్లు బాదిన ట్రిస్టన్ స్టబ్స్(14)ను సైతం ఔట్ చేసి సఫారీలను దెబ్బతీశాడీ యంగ్‌స్టర్. దాంతో.. 16 పరుగులకే రెండు బిగ్ వికెట్లు కోల్పోయింది సఫారీ జట్టు. అంతుకుముందు బుమ్రా ఓవర్లో మర్క్రమ్(14)కు లైఫ్ లభించింది. అతడు సిక్సర్ కొట్టాలనుకున్న బంతిని బౌండరీ వద్ద శివం దూబే పైకెగిరి అందుకొని.. రోప్ తగిలేలోపు బయటకు విసిరేశాడు.
Quinton de Kock ✅
Tristan Stubbs ✅Early success with the ball for #TeamIndia, courtesy Arshdeep Singh! 👏
Updates ▶️ https://t.co/tiemfwcNPh #INDvSA | @arshdeepsinghh | @IDFCFIRSTBank pic.twitter.com/7bgQ50Ulkg
— BCCI (@BCCI) December 9, 2025
స్టబ్స్ వికెట్ పడడంతో క్రీజులోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ (16 నాటౌట్).. తనస్టయిల్‌లో చెలరేగుతున్నాడు. వరుణ్ చక్రవర్తి ఓవర్లో 4,6 బాదిన బ్రెవిస్ స్కోర్ 40 దాటించాడు. అయితే.. ఆరో ఓవర్లో తొలి బంతికే మర్క్రమ్ లెగ్ స్టంప్‌ను ఎగరేశాడు అక్షర్ పటేల్. అంతే.. 40కే మూడు వికెట్లు పడ్డాయి. పవర్ ప్లేలో 3 వికెట్ల నష్టానికి సఫారీ టీమ్ 45 రన్స్ చేసింది.