IND vs USA : పొట్టి వరల్డ్ కప్‌లో బౌలర్లకు స్వర్గధామంలా మారిన పిచ్‌పై భారత(India) పేసర్లు విజృంభించారు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(4/9) నిప్పులు చెరగగా.. హార్దిక్ పాండ్యా(2/14) మరోసారి బంతితో మెరిశాడు. దాంతో, బౌన్సీ పిచ్‌పై ఆతిథ్య అమెరికా బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. ఒక దశలో100 లోపై చాపచుట్టేలా కనిపించిన యూఎస్ఏను నితీశ్ కుమార్(27), ఓపెనర్ స్టీవెన్ టేలర్(24)లు ఆదుకున్నారు. ఉన్నంత సేపు దూకుడుగా ఆడి గౌరవప్రదమైన స్కోర్‌కు బాటలు వేశారు. దాంతో అమెరికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 రన్స్ కొట్టింది.
మెగా టోర్నీలో రెండు విజయాలతో జోరు మీదున్న భారత్.. కీలక పోరులో అమెరికాను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. టాస్ గెలిచి రోహిత్ శర్మ ఆతిథ్య జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బౌన్స్‌కు నెలవైన న్యూయార్క్ పిచ్‌పై లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆదిలోనే రెండు వికెట్లు తీసి బ్రేకిచ్చాడు. తొలుత ఓపెనర్ శయాన్ జహంగీర్(0)ను ఎల్బీగా వెనక్కి పంపిన అర్ష్‌దీప్.. ఆ కాసేపటికే ఆండ్రీస్ గౌస్(2)ను డగౌట్‌కు చేర్చాడు.
What. A. Start! 👌 👌
2⃣ wickets in the first over by Arshdeep Singh 👏 👏
Follow The Match ▶️ https://t.co/HTV9sVyS9Y#T20WorldCup | #TeamIndia | #USAvIND pic.twitter.com/oEU3dCBoaQ
— BCCI (@BCCI) June 12, 2024
ఆ తర్వాత కెప్టెన్ అరోన్ జోన్స్(10), స్టీవెన్ టేలర్(5)లు మూడో వికెట్‌కు 22 రన్స్ జోడించి ఆశలు రేపారు. డేంజరస్ జోన్స్‌ను పవర్ ప్లే తర్వాత పాండ్యా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వచ్చిన నితీశ్ కుమార్(27) జతగా టేలర్ జట్టు స్కోర్ 50 దాటించాడు. అక్షర్ పటేల్ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన అతడు ఆ తర్వాత బంతిని వికెట్ల మీదుకు ఆడుకున్నాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా నితీశ్, కొరే అండర్సన్(14)లు రన్‌రేటు తగ్గనివ్వలే. అక్షర్ పటేల్, పాండ్యా ఓవర్లలో ఇద్దరూ బౌండరీలు దంచారు. అయితే.. మళ్లీ బంతి అందుకున్న అర్ష్‌దీప్ ఈ జోడీని విడదీశాడు. నితీశ్ కొట్టిన బంతిని సిరాజ్ బౌండరీ వద్ద అమాంతం గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. అంతే.. అమెరికా 81 వద్ద ఐదో వికెట్ పడింది. అక్కడితో మొదలు అండర్సన్, హర్మీత్ సింగ్(10).. అందరూ పెవిలియన్‌కు క్యూ కట్టారు. సిరాజ్ వేసిన 20వ ఓవర్లో 7 రన్స్ వచ్చాయి. దాంతో, అమెరికా.. భారత్‌కు తేలికైన లక్ష్యాన్ని నిర్దేశించింది.
Mohd. Siraj with a beauty of a catch! 🫡
Arshdeep Singh scalps his 3⃣rd wicket! 👏
Follow The Match ▶️ https://t.co/HTV9sVyS9Y#T20WorldCup | #TeamIndia | #USAvIND pic.twitter.com/FgUo8ESO7m
— BCCI (@BCCI) June 12, 2024