పంజిమ్: ఫిడే చెస్ ప్రపంచకప్‌లో కోట్లాది మంది భారతీయుల ఆశలను మోస్తున్న గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన క్వార్టర్స్ టైబ్రేకర్‌లో అర్జున్.. 1.5-2.5తో వీయ్ యీ (చైనా) చేతిలో ఓడిపోయాడు. క్వార్టర్స్‌లో రెండు గేమ్స్‌ను డ్రాగా ముగించిన అతడు.. కీలకమైన టైబ్రేకర్‌లోనూ సత్తాచాటలేకపోయాడు. అర్జున్ ఓటమితో ఈ టోర్నీలో భారత ప్రాతినిధ్యానికి తెరపడటంతో పాటు వచ్చే ఏడాది జరగాల్సిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలోనూ దేశానికి బెర్తు దూరమైనైట్టెంది. ఈ టోర్నీ టాప్-3లో నిలిచిన ఆటగాళ్లు క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధిస్తారు. ఇక సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో ఏకంగా 24 మందితో బరిలోకి దిగిన భారత్ నుంచి ఒక్కరు కూడా క్వార్టర్స్ దాటకపోవడం విచారకరం.