పంజిమ్: చెస్ ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్స్ చేరిన భారత గ్రాండ్‌మాస్టర్లు అర్జున్ ఇరిగేసి, పెంటేల హరికృష్ణ.. ఐదో రౌండ్లో తమ తొలి గేమ్‌ను డ్రా చేసుకున్నారు. తెల్లపావులతో ఆడిన అర్జున్.. 41 ఎత్తుల తర్వాత లెవొన్ అరొనియన్ (అర్మెనియా)తో గేమ్‌ను డ్రాగా ముగించాడు.
ఒకదశలో గేమ్‌పై పట్టుసాధించేలా కనిపించిన అర్జున్.. దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అంతకుముందు నల్లపావులతో ఆడిన హరికృష్ణ సైతం.. మెక్సికో గ్రాండ్‌మాస్టర్ జోస్ ఎడ్వర్డ్ మార్టినెజ్‌తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు.