ఢిల్లీ: తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి మరో సంచలన ప్రదర్శన చేశాడు. ఇజ్రాయెల్‌లో జరిగిన జెరూసలేం మాస్టర్స్ ఫైనల్లో అతడు.. 2.5-1.5తో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
బుధవారం రాత్రి ముగిసిన ఫైనల్స్‌లో భాగంగా మొదట రెండు ర్యాపిడ్ గేమ్స్ డ్రాగా ముగియడంతో విజేతను టైబ్రేక్ ద్వారా నిర్ణయించారు. టైబ్రేకర్‌లో భాగంగా బ్లిట్జ్‌లో తెల్లపావులతో ఆడి విజయం సాధించిన అర్జున్.. రెండో గేమ్‌ను డ్రా చేసుకుని ఆధిక్యంతో నిలవడమే గాక టైటిల్‌నూ గెలిచాడు.