ఢిల్లీ : ఇటీవలే ముగిసిన జెరూసలేం మాస్టర్స్‌లో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించిన తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి మరో అద్భుత ప్రదర్శనతో సత్తాచాటాడు.
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో అతడు.. మరో దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)కూ షాకిచ్చాడు. గ్రూప్ దశలో సోమవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో కార్ల్‌సన్‌ను ఓడించిన అర్జున్.. పాయింట్ల పట్టికలో 4.5తో నాకౌట్ దశకు చేరుకున్నాడు.