షిమ్కెంట్(కజకిస్థాన్): ఏషియన్ షూ టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతక హవా కొనసాగుతున్నది. శనివారం జరిగిన 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత యువ ద్వయం అర్జున్ బబుతా, ఎలావెనిల్ వాలరివన్ పసిడి పతకంతో మెరిసింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన తుదిపోరులో అర్జున్, ఎలావెనిల్ జోడీ 17-11తో చైనా జంట డింగ్కెలు, జిన్లు పెంగ్‌పై అద్భుత విజయం సాధించింది.
తొలి రౌండ్లలో చైనా షూటర్లు ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ భారత షూటర్లు అంతే దీటుగా బదులివ్వడంతో పోటీ ఆసక్తికరంగా సాగింది. టో ర్నీలో ఇప్పటికే అర్జున్, ఎలావెనిల్ రెండేసి స్వర్ణాలు సొంతం చేసుకోవడం విశేషం. మరోవైపు జూనియర్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్‌ఈవెంట్‌లో శాంభవి శ్రవణ్, నరెన్ ప్రణవ్ 16-12తో చైనా టీమ్‌పై గెలిచి పసిడి సొంతం చేసుకున్నారు. శాంభవివి ఈ టోర్నీలో ఇది రెండో స్వర్ణం.