Lionel Messi : ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకడైన లియోనల్ మెస్సీ(Lionel Messi)కి అరుదైన గౌరవం లభించనుంది. అర్జెంటీనా లెజెండరీ ఆటగాడు డిగో మారడోనా(Diego Maradona)కు సైతం దక్కని గుర్తింపు ఈ ఫార్వర్డ్ ప్లేయర్‌కు దక్కనుంది. మెస్సీ ధరించే 10వ నంబర్ జెర్సీకి శాశ్వతంగా వీడ్కోలు పలకాలని అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘం(AFA) నిర్ణయించింది.
వరల్డ్ కప్ హీరో మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించాక ఆ జెర్సీని మరెవరికీ కేటాయించకూడదని తీర్మానించింది. ఈ విషయాన్ని సోమవారం ఏఎఫ్ఏ అధ్యక్షుడు క్లాడియో తపియా(Claudio Tapia) వెల్లడించాడు. ‘అంతర్జాతీయ కెరీర్‌కు మెస్సీ వీడ్కోలు పలికాక అతడి జెర్సీని పక్కన పెట్టేస్తాం. మెస్సీకి గౌరవార్థంగా ఆ జెర్సీని అతడితో పాటు వీడ్కోలు పలుకుతాం. కొత్తగా జట్టులోకి వచ్చే యువ ఆటగాళ్లకు 10వ నంబర్ జెర్సీని కేటాయించం. దిగ్గజ ఫుట్‌బాలర్ అయిన మెస్సీ కోసం మేము చేయగలిగిన చిన్న పని ఇదే’ అని క్లాడియో తెలిపాడు.
Una camiseta legendaria merece un dueño legendario y estamos buscando uno👀
Contanos a nosotros y a @socios qué locura harías por conseguir esta camiseta, y podría ser tuya 🇦🇷🏆
Haz clic en el enlace ahora 👉 https://t.co/rcb0SMyJWN pic.twitter.com/6S8E47QRSa— 🇦🇷 Selección Argentina ⭐⭐⭐ (@Argentina) December 30, 2023
గతంలో 10వ నంబర్ జెర్సీతో మారడోనా మైదానంలో అద్భుతాలు చేశాడు. అతడు వీడ్కోలు పలికిన అనంతరం ఆ జెర్సీని కూడా ఎవరికీ కేటాయించొద్దని అర్జెంటీనా భావించింది. కానీ, అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య అర్జెంటీనా ప్రతిపాదనను తోసిపుచ్చింది. నిరుడు ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనాను ఫైనల్‌కు చేర్చిన మెస్సీ.. తన కలను నిజం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌పై గెలుపొందిన మెస్సీ సేన సగర్వంగా ట్రోఫీని అందుకుంది.
⭐⭐⭐ Un año de victorias y festejos 🇦🇷
📝 https://t.co/11EwaKSgbv pic.twitter.com/34JwBGg0iu
— 🇦🇷 Selección Argentina ⭐⭐⭐ (@Argentina) December 31, 2023
అనంతరం అతడు పీఎస్జీ క్లబ్‌ను వీడి ఇంటర్ మియామి(Inter Miami)తో ఒప్పందం చేసుకున్నాడు. మేజర్ సాకర్ లీగ్‌లో సంచలన ఆటతో మియామి క్లబ్‌ను విజేతగా నిలిపాడు. 2023లో అత్యుత్తమ ప్రదర్శనకు మెస్సీ.. ఎనిమిదోసారి బాలిన్ డి ఓర్ అవార్డు సాధించాడు. అంతేకాదు ప్రతిష్ఠాత్మక ‘పుబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డు కోసం భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)తో పోటీ పడ్డాడు. అయితే.. చివరకు విరాట్ విజేతగా నిలిచాడు.