అంటాల్య(టర్కీ): పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారత మహిళల ఆర్చరీ టీమ్ సత్తాచాటింది. ఆర్చరీ ప్రపంచకప్ మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో వెన్నెం జ్యోతిసురేఖ, అదితి స్వామి, పర్నీత్కౌర్తో కూడిన భారత త్రయం పసిడి పతకంతో మెరిసింది.
శనివారం జరిగిన కాంపౌండ్ టీమ్ ఫైనల్లో భారత్ 232-229తో లిసెల్ జట్మ, మిరీ మరీ, మారిస్ టెట్స్మన్(ఇస్తోనియా)పై అద్భుత విజయం సాధించింది. మెగాటోర్నీలో స్వర్ణం సాధించడం సురేఖ, అదితి, పర్నీత్కౌర్కు వరుసగా మూడోసారి కావడం విశేషం. మరోవైపు పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో ప్రియాంశ్ 148-149తో మైక్ స్కోలెస్సర్(నెదర్లాండ్స్) చేతిలో ఓడి రజత పతకం ఖాతాలో వేసుకున్నాడు.