ఫ్లోరిడా(అమెరికా) : ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-1లో భారత ఆర్చర్లు సత్తా చాటుతున్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, రిషభ్ యాదవ్ జోడీ 159-155తో ఎల్లిసన్, జెవ్స్నిక్ (స్లోవేనియా)ను ఓడించి ఫైనల్ చేరింది. తొలి రౌండ్లో స్పెయిన్‌ను క్వార్టర్స్‌లో డెన్మార్క్‌ను చిత్తుచేసి ఫైనల్ చేరిన భారత జట్టు.. టైటిల్ పోరులో చైనీస్ తైపీతో తలపడనుంది. కానీ రికర్వ్ మిక్స్డ్ టీమ్ క్వార్టర్స్‌లో అన్షిక-ధీరజ్ ద్వయం 2-6తో ఎలియా-పాబ్లో(స్పెయిన్) చేతిలో ఓడింది.