IPL 2025 : పంజాబ్ కింగ్స్ సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్(2-15) నిప్పులు చెరుగుతున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(0)ను బౌల్డ్ చేసిన ఈ స్పీడ్‌స్టర్.. ఆఖరి బంతికి పంజాబ్ సారథి శ్రేయాస్ అయ్యర్(10)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో సందీప్ శర్మ స్లో బాల్‌తో మార్కస్ స్టోయినిస్(1)ను డగౌట్‌కు చేర్చాడు. ప్రస్తుతం ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(17), నేహల్ వధేరా(8)లు ఆచితూచి ఆడుతున్నారు. 6 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 43-3.
ఐపీఎల్ 18వ సీజన్లో ఓటమెరుగని పంజాబ్ కింగ్స్‌కు ఊహించని షాక్. 205 పరుగుల ఛేదనలో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(0)ను తొలి బంతికే ఆర్చర్ బౌల్డ్ చేశాడు. 140 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతి వికెట్లను గిరాటేసింది. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్(10) రెండు ఫోర్లు బాదినా.. ఆఖరి బంతికి బౌల్డ్ అయ్యాడు. ఆ కాసేపటికే మార్కస్ స్టోయినిస్(1)ను స్లో బాల్‌తో బుట్టలో వేసుకున్నాడు సందీప్ . రిటర్న్ క్యాచ్‌తో అతడిని వెనక్కి పంపడంతో 26 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది పంజాబ్.
Archer on 🎯
Jofra Archer’s double timber-strike gives #RR a dream start 💥
Updates ▶ https://t.co/kjdEJydDWe#TATAIPL | #PBKSvRR | @JofraArcher | @rajasthanroyals pic.twitter.com/CfLjvlCC6L
— IndianPremierLeague (@IPL) April 5, 2025