e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home News Tokyo Olympics: ప్రీక్వార్టర్స్‌లోకి ఆర్చర్‌ అతాను దాస్‌

Tokyo Olympics: ప్రీక్వార్టర్స్‌లోకి ఆర్చర్‌ అతాను దాస్‌

టోక్యో: భారత ఆర్చర్‌ అతాను దాస్‌ ప్రీక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. రెండుసార్లు గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన దక్షిణ కొరియా ఆర్చర్‌పై సంచలన విజయం నమోదుచేశాడు. పురుషుల వ్యక్తిగత విభాగం 1/16 ఎలిమినేషన్స్‌లో దక్షిణ కొరియా ఆటగాడు ఓ జిన్‌ హయాక్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 5-6 తేడాతో గెలుపొందాడు. కాగా, మ్యాచ్‌ సమయం ముగిసే సరికి ఇరువురి స్కోర్లు సమం కావడంతో షూట్‌ ఆఫ్‌ నిర్వహించారు. ఇందులో అతాను దాస్‌ పైచేయి సాధించి ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. దాస్‌ సతీమణి ఆర్చర్‌ దీపికా కుమారి ఇప్పటికే మహిళల వ్యక్తిగత విభాగం ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. కాగా, అంతకుముందు జరిగిన ఎలిమినేషన్‌ మ్యాచ్‌లో చైనీస్ తైపీ ఆర్చర్ డెంగ్ యు చెంగ్‌పై 4-6 తేడాతో అతాను దాస్‌ విజయం సాధించాడు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana