దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు మిన్నంటాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. దిగ్గజ క్రికెటర్ ధోనీతో మొదలుపెడితే డేవిడ్ వార్నర్, అభినవ్ బింద్రా, పీవీ సింధు, మీరాబాయి చాను, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, సానియా మీర్జా, సచిన్ టెండ్కూలర్, రోహిత్‌శర్మ, శిఖర్ ధవన్, మిథాలీరాజ్, హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో సందేశాలు రాసుకొచ్చారు.
స్వాతంత్య్ర దినోత్సవ సంబురాల్లో భాగంగా సోమవారం జాతీయ జెండా ఆవిష్కరించిన టీమ్ఇండియా
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయులందరికీ విరుష్క జోడీ..ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలిపింది.