Virat Kohli Birthday : టీమిండియా రన్ మెషిన్, బర్త్ డే బాయ్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి అతడి భార్య అనుష్కా శర్మ(Anushka Sharma) శుభాకాంక్షలు తెలిపింది. ఈ ప్రత్యేకమైన రోజున ఆమె.. విరాట్ కెరీర్, తమ అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఫొటోలతో ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది.
ఆ పోస్ట్‌కు ‘జీవితంలోని ప్రతి పాత్రలో అసాధారణ వ్యక్తి. అద్భుతమైన కెరీర్లో మరిన్ని రికార్డులు తనపేరిట లిఖించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ జీవితాంతం, ఆ తర్వాత కూడా నిన్ను ఎంతో ప్రేమిస్తాను’ అంటూ అనుష్క క్యాప్షన్ రాసుకొచ్చింది.
విరాట్, అనుష్క 2017 డిసెంబర్ 11న వివాహం చేసుకున్నారు. వీళ్లకు 2021 జనవరి 11వ తేదీన వామిక జన్మించింది. సొంత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు విజయాల్లో కోహ్లీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీలంకపై సెంచరీతో కలిపి 442 పరుగులు చేశాడు. కోహ్లీ బర్త్ డే నాడే టీమిండియా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. ఎంతో ప్రత్యేకమైన ఈరోజున రికార్డుల రారాజు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు.