IPL 2025 : పవర్ ప్లేలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు విధ్వంసం కొనసాగించగా.. స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత సన్‌రైజర్స్‌కు వికెట్ లభించింది. యువ స్పిన్నర్ జీషన్ అన్సారీ తొలి వికెట్ అందించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన సాయి సుదర్శన్(48)ను ఔట్ చేసి బ్రేకిచ్చాడు. కట్ షాట్ ఆడబోయిన సాయి వికెట్ కీపర్ క్లాసెన్ చేతికి చిక్కాడు. దాంతో, 87 పరుగుల వద్ద గుజరాత్ మొదటి వికెట్ పడింది. అయితే.. జోస్ బట్లర్(19 నాటౌట్), శుభ్‌మన్ గిల్(52 నాటౌట్)లు ధాటిగా ఆడుతూ స్కోర్ 100 దాటించారు.
షమీ వేసిన 10వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లకు గుజరాత్ స్కోర్.. 120-1. సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్(48), శుభ్‌మన్ గిల్(52 నాటౌట్)లు దంచికొట్టారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఉతికేస్తూ స్కోర్ బోర్డును రాకెట్ వేగంతో పరుగులు పెట్టిస్తున్నారు.
🚨 Milestone alert
The consistent Jos Buttler glides past 4️⃣0️⃣0️⃣0️⃣ runs in #TATAIPL 👏
Updates ▶ https://t.co/u5fH4jQrSI#TATAIPL | #GTvSRH | @josbuttler pic.twitter.com/xX5en5cvAp
— IndianPremierLeague (@IPL) May 2, 2025
వీళ్లిద్దరూ పోటాపోటీగా ఆడుతుండడంతో గుజరాత్ జట్టు పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 82 రన్స్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌కు తొలి ఆరు ఓవర్లలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఇంతకుముందు 78-0 అత్యుత్తమంగా ఉండేది. స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత జీషన్ బౌలింగ్‌లో సాయి.. క్లాసెన్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత జోస్ బట్లర్(19) అండగా గిల్ దూకుడుగా ఆడుతున్నాడు. ఈ సీజన్లో రెచ్చిపోయి ఆడుతున్న బట్లర్ ఐపీఎల్లో 4 వేల పరుగుల మైలురాయికి చేరుకున్నాడు.