మెల్బోర్న్: టీ20 వరల్డ్ కప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం తమ జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ సారథిగా వ్యవహరించనున్న 15 మంది సభ్యులలో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌తో పాటు ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తున్న జేక్ ఫ్రేజర్‌కు చోటు దక్కలేదు. ఈ ఏడాది టెస్టులు, వన్డేల నుంచి తప్పుకున్న డేవిడ్ వార్నర్ జట్టులో స్థానాన్ని నిలుపుకున్నాడు. వికెట్ కీపర్లుగా జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్ ఉన్నారు. ఐపీఎల్లో విఫలమవుతున్నా మ్యాక్స్‌వెల్‌కు జట్టులో చోటు దక్కింది.
ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లీస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా