గువహటి : స్వదేశంలో భారత జట్టు దారుణంగా తడబడుతుండటంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏడాది క్రితం న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమిని ఎదుర్కున్న భారత్.. తాజాగా దక్షిణాఫ్రికాతోనూ అదే బాటలో వెళ్తుండటంతో హెడ్‌కోచ్‌గా గంభీర్ దారుణంగా విఫలమయ్యాడని వారు ఆరోపిస్తున్నారు.
రెండో టెస్టులో భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయిన అనంతరం సోషల్‌మీడియాలో ‘#Sack Gautam Gambhir’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అయింది. మునుపెన్నడూలేని విధంగా ఏడాదికాలంగా సొంతగడ్డపై స్పిన్ ఆడటంలో తంటాలు పడుతున్న భారత జట్టును ఇకనైనా కాపాడాలంటే కోచ్‌గా గంభీర్‌ను తప్పించాలని బీసీసీఐని కోరుతూ పలువురు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. గంభీర్‌తో పాటు సెలెక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్‌కూ సెగ గట్టిగానే తగులుతున్నది.