కాజీపేట, జనవరి 14 : హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో జరుగుతున్న 58వ జాతీయస్థాయి సీనియర్ ఖోఖో పోటీల్లో క్రీడాకారులు నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నారు. ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ఆంధ్ర ప్రదేశ్ జట్టు 28-21తో ఆతిథ్య తెలంగాణ జట్టుపై విజయం సాధించింది. డిఫెండర్లు ఆశించిన మేర రాణించకలేకపోవడం, ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపంతో చేజింగ్లో అధిక ఫౌల్స్ ఆ జట్టు ఓటమికి కారణమయ్యాయి.
పురుషుల క్వార్టర్ ఫైనల్లో రైల్వేస్, ఒడిశా, కొల్హాపూర్, మహారాష్ట్ర గెలుపొందాయి. మహిళ విభాగంలో మహారాష్ట్ర, ఢిల్లీ, ఎయిర్ ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఒడిశా సెమీస్కు ప్రవేశించాయి. నేడు ఫైనల్ మ్యాచ్లు జరుగనున్నాయి.