James Anderson | నాలుగు పదులు.. 700 వికెట్లు.. 147 ఏండ్లలో ఒకేఒక్కడు
James Anderson : ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson) ఏడొందల క్లబ్లో చేరాడు. ధర్మశాల టెస్టు (Dharmashala Test)లో కుల్దీప్ యాదవ్(30)ను ఔట్ చేసిన జిమ్మీ ఈ మైలురాయికి చేరువయ్యాడు. తద్వారా 147 ఏండ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో...
James Anderson : ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson) ఏడొందల క్లబ్లో చేరాడు. ధర్మశాల టెస్టు (Dharmashala Test)లో కుల్దీప్ యాదవ్(30)ను ఔట్ చేసిన జిమ్మీ ఈ మైలురాయికి చేరువయ్యాడు. తద్వారా 147 ఏండ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాదు మొత్తంగా ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఈ స్పీడ్‌స్టర్ మరో రికార్డు నెలకొల్పాడు.
టెస్టుల్లో ఎక్కువ వికెట్ల వీరుల జాబితాలో ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో టాప్‌లో ఉండగా.. ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్(708) వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. భారత పర్యటనకు ఎంపికైన అండర్సన్ వైజాగ్ టెస్టు(Vizag Test)లో బరిలోకి దిగాడు.
Murali, Warne, and now James Anderson 7⃣0⃣0⃣ pic.twitter.com/l0zUYuZtL6
— ESPNcricinfo (@ESPNcricinfo) March 9, 2024
దాంతో, ఈ లెజెండరీ పేసర్ భారత గడ్డపై అరుదైన ఫీట్ సాధించాడు. ఇండియాలో టెస్టు మ్యాచ్ ఆడిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. టీమిండియా క్రికెటర్ లాల్ అమర్నాథ్(Lal Amarnath) పేరిట ఉన్న 72 ఏండ్ల రికార్డును బ్రేక్ చేశాడు. అండర్సన్ టెస్టు కెరీర్ 2003లో మొదలైంది. అప్పటి నుంచి అతడు ప్రతి ఏడాది వికెట్లు తీస్తూనే ఉన్నాడు. ఇంగ్లండ్ ప్రధాన బౌలర్‌గా ఎదిగిన అండర్సన్ యాషెస్ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు.
Another milestone reached 📈
More history made 📘Jimmy’s 700 Test wickets in numbers here: https://t.co/Eann2PXc97 pic.twitter.com/kdfgcur4ow
— England Cricket (@englandcricket) March 9, 2024
2016లో తొలిసారి
నలభై ఏండ్ల వయసులో వరల్డ్ నంబర్ 1 అయిన రెండో బౌలర్‌గా అండర్సన్ గుర్తింపు సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్ క్లారీ గ్రిమ్మెట్ 40 ఏళ్లకు 1936లో టాప్ ర్యాంక్ అందుకున్నాడు.అండర్సన్ 2016లో మొదటిసారరి వరల్డ్ నంబర్ వన్ బౌలర్ అయ్యాడు. తన సహచరుడు స్టువార్ట్ బ్రాడ్‌ను దాటేసి అతను నంబర్ 1 ర్యాంకుకు ఎదగబాకాడు. ఆ తర్వాత అండర్సన్ 2018లో ఐదు నెలలు నంబర్ వన్ బౌలర్‌గా ఉన్నాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ అతడిని వెనక్కి నెట్టి అగ్రస్ధానానికి చేరాడు.
We are so lucky to be witnessing utter greatness 🙏
An unfathomable achievement built of unrivalled skill, longevity and absolute dedication 🦁
Congratulations, @jimmy9 👏 pic.twitter.com/fFuDPCoaap
— England Cricket (@englandcricket) March 9, 2024
32 సార్లు 5 వికెట్లు
అండర్సన్ గత రెండు దశాబ్దాలకు పైగా ఇంగ్లండ్ పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్నాడు. స్టువార్డ్ బ్రాడ్‌తో కలిసి వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. ఇన్‌స్వింగ్‌తో బ్యాటర్లను బొల్తా కొట్టించే అండర్సన్ టెస్టు ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 682 టెస్టు వికెట్లు ఉన్నాయి.

శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు), ఆస్ట్రేలియా దివంగత లెగ్ స్పిన్నర్ షేన్‌వార్న్ (708 వికెట్లు) వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ లెజెండరీ బౌలర్ టెస్టుల్లో 32 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
ఇవి కూడా చదవండి
- IND vs ENG 5th Test | తిప్పేసిన అశ్విన్.. లంచ్‌లోపే పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్
- Manakondur | మానకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిలిచిన నీటి సరఫరా.. రోగులకు తప్పని పాట్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

