Anand Mahindra | హామీ నిలుపుకున్న ఆనంద్ మహీంద్రా.. నీరజ్, సుమిత్‌లకు ఎక్స్‌యూవీ700 కార్లు బహూకరణ
Anand Mahindra | ఒలింపిక్స్ హీరోలు నీరజ్‌చోప్రా, సుమిత్ అంటిల్‌లకు ఆనంద్ మహీంద్రా ఎక్స్‌యూవీ700 కార్లు అందజేశారు.

Anand Mahindra | మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన హామీని నిలుపుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారి జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణపతకం గెలుచుకున్న నీరజ్ చోప్రా, పారాలంపిక్స్‌లో పసిడి గెలుచుకున్న సుమిత్ అంటిల్‌లకు కొత్తగా మార్కెట్లో ఆవిష్కరించిన ఎక్స్‌యూవీ 700 కార్లను స్వయంగా అందచేశారు. పానీపట్‌లోని నీరజ్ చోప్రా, సోనీపట్‌లోని సుమిత్ అంటిల్ ఇండ్లకు వెళ్లి ఆయా కార్ల తాళాలను అందించారు. తనకు కారు గిఫ్ట్‌గా ఇచ్చినందుకు ఆనంద్ మహీంద్రాకు నీరజ్ చోప్రా ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ఆ కారు డ్రైవ్ చేస్తానని సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.

దేశ చరిత్రలో తొలిసారి ట్రాక్ ఫీల్డ్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలుచుకున్న నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించారు. హర్యానాలోని పానీపట్ జిల్లా ఖందారా ఆయన స్వగ్రామం. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌త్రోలో స్వర్ణ పతకం గెలుచుకున్న నీరజ్ చోప్రాపై కేంద్ర ప్రభుత్వం, హర్యానాతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల రివార్డుల వర్షం కురిపించాయి.

ఆనంద్ మహీంద్రా కూడా అప్పటికి ఇంకా విపణిలో అడుగు పెట్టని ఆల్ న్యూ ఎక్స్‌యూవీ700 కారును నీరజ్ చోప్రాకు బహుకరిస్తానని వాగ్దానం చేశారు. శనివారం నేరుగా చోప్రా నివాసానికి వెళ్లి ఆ కారు తాళాలను ఆయనకు అందించారు. గమ్మత్తేమిటంటే నీరజ్ చోప్రాకు బహుకరించిన కారు నంబర్ 8758 కావడం స్పెషల్. అవును మరి ఒలింపిక్స్‌లో జావెలిన్ 87.58 మీటర్ల దూరం విసిరి రికార్డు నెలకొల్పారు. అదే నంబర్‌పై నీరజ్‌చోప్రా కారును రిజిస్టర్ చేశారు. ఇదే విషయాన్ని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఇక పారాలంపిక్స్‌లో జావెలిన్త్రోలోనే స్వర్ణ పతకం పొందిన సుమిత్ అంటిల్‌కు బహుకరించిన కారుకు నంబర్ రాలేదు. జావెలిన్ త్రోలో 68.55 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలుచుకున్న సుమిత్ కారుది ప్రపంచ రికార్డే. అదే నంబర్ రిజిస్టర్ కానున్నది. ఒలింపిక్స్ పూర్తయ్యాక స్వర్ణ పతకాలు గెలుచుకున్న వారందరికీ ఇదే ఎక్స్‌యూవీ 700 మోడల్ కారును గిఫ్ట్‌గా బహుకరిస్తానని ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
RRR: ఆర్ఆర్ఆర్ అభిమానులకి గుడ్ న్యూస్.. ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడో తెలుసా?
RRR సినిమాను కావాలనే తక్కువ రేట్లకు అమ్ముతున్నారా..?
పవన్ కళ్యాణ్‌ను ఫస్ట్ టైం పవర్ స్టార్ అని ఎవరు పిలిచారో తెలుసా !
Pawan: పవన్ సినిమాతో అకీరా నందన్ టాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతున్నాడా..!
power star pawan kalyan | మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
ఆ విషయంలో పవన్ కళ్యాణ్ తర్వాత విజయ్ దేవరకొండనే.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

