RRR సినిమాను కావాలనే తక్కువ రేట్లకు అమ్ముతున్నారా..?

RRR | రాజమౌళి ( Rajamouli ) సినిమాకు బిజినెస్ ఎలా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో హీరోలతో పని లేకుండా కేవలం తన పేరుతోనే మార్కెట్ చేసుకునే దర్శకుల్లో రాజమౌళి అందరికంటే ముందుంటాడు. పోస్టర్‌పై రాజమౌళి అనే పేరు కనిపిస్తే చాలు వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది. మరీ ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ ఆకాశమంత పెరిగిపోయింది. అందుకే ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా బిజినెస్ కూడా అలాగే జరుగుతుంది. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్స్ నటిస్తున్న కూడా రాజమౌళి సినిమా అనే ప్రచారం చేస్తున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దర్శక ధీరుడికి ఇండియన్ సినిమాలో ఉన్న ఇమేజ్ ఎంటనేది. ఇదిలా ఉంటే ఈ సినిమా రైట్స్‌ను ముందుగా అనుకున్న దానికంటే తక్కువ ధరకే రైట్స్ అమ్ముతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రెండు నెలలు దాటిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. జనవరి 7, 2022 సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా విడుదల చేశారు. నవంబర్ నుంచి ప్రమోషన్ కూడా మొదలు పెట్టనున్నారు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ ఈవెంట్ దుబాయిలో జరగబోతుందని తెలుస్తోంది. గతంలో శంకర్ తెరకెక్కించిన ఐ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అక్కడే జరిగింది. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా బిజినెస్ విషయంలో ఇప్పుడు కొన్ని కొత్త లెక్కలు బయటికి వస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో ముందు మాట్లాడుకున్న దాని కంటే తక్కువ రేటుకు సినిమాను అమ్మేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 30 శాతం తక్కువకు ట్రిపుల్ ఆర్ సినిమా హక్కులు అమ్ముతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రాలోని ఈస్ట్ ఏరియా కరోనాకు ముందు 18 కోట్ల రేషియో డీల్ కుదుర్చుకున్నారని.. కానీ ఇప్పుడు అది 13 కోట్లకు తగ్గించినట్లు తెలుస్తోంది. అలాగే ఉత్తరాంధ్ర హక్కులు కూడా 26 కోట్ల నుంచి 19 కోట్లకు.. ఆంధ్ర సీడెడ్ 98 కోట్ల నుంచి 68 కోట్లకు కుదించినట్లు ప్రచారం జరుగుతుంది. ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 600 కోట్ల నుంచి 450 కోట్లకు తగ్గించారు అని ప్రచారం జరుగుతోంది. బయట ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలు నష్టపోకుండా డీల్ మాట్లాడుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
దృశ్యం పాపను గుర్తుపట్టారా ? ఇంతలా మారిపోయిందేంటి?
RRR | అక్టోబర్ 29న రెడీగా ఉండండి..ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్
Jr NTR | బాలీవుడ్ బడా దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ మంతనాలు
RRR ముందున్న టార్గెట్ తెలిస్తే కళ్లు బైర్లు గమ్మడం ఖాయం..
Ntr: జూనియర్ ఎన్టీఆర్ క్రికెట్ చూడకపోవడానికి ఆయన తండ్రే కారణమట..!
Rajamouli
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

