బాలీవుడ్ బడా దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ మంతనాలు

NTR to work with Sanjay Leela Bhansali | ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ లైనప్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంచుకుంటున్న కథలు.. చేస్తున్న సినిమాలు చూస్తుంటే ఇతర హీరోలకు నిద్ర కూడా పట్టడం లేదు. అంత అద్భుతంగా దర్శకుల సెలక్షన్ చేసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళి సినిమా తర్వాత కచ్చితంగా తనకు పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందని నందమూరి వారసుడికి తెలియని విషయం కాదు. అందుకే దానికి తగ్గట్లుగానే సినిమాలు కూడా ఎంచుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. మరీ ముఖ్యంగా తర్వాత చేయబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా కథలు కావడం విశేషం. రాజమౌళి తర్వాత వెంటనే కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలు కానుంది.
దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తారక్. 2022 మధ్యలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఇవన్నీ ఇలా ఉండగా అనే మరో సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందని మూడేళ్లుగా ప్రచారం బాగానే జరుగుతుంది. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా ప్రకటన చేయలేదు.
ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి జై బావ్ రే అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు. ఇది కూడా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లోనే వస్తుందని తెలుస్తోంది. అన్నీ కుదిరి భన్సాలీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే మాత్రం అంతకంటే పెద్ద సంచలనం మరొకటి ఉండదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ వస్తే ఆర్.నారాయణమూర్తి ఎందుకు రిజెక్ట్ చేశాడు?
కొరటాల సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ నిర్ణయం..!
RRR: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ స్టార్ట్.. దుబాయ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్
NTR: కోలుకుంటున్న ఎన్టీఆర్ అభిమాని.. రూ. 2.5 లక్షలు సాయం అందించిన ఫ్యాన్ క్లబ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

