నిన్న మొన్నటి వరకు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు అక్కడి నుంచి బంధ విముక్తుడు అయ్యాడు. అందుకే గెటప్ కూడా మార్చేశాడు. కోర మీసాలతో కొమరం భీమ్ గెటప్‌లో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు నార్మల్ లుక్‌లోకి వచ్చేశాడు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తి అయిపోయాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అక్టోబర్ నాటికి పూర్తి అవుతుందని చిత్ర యూనిట్ చెప్పింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా థియేటర్స్ పూర్తి స్థాయిలో తెరుచుకోలేవని.. అందుకే సరైన సమయం చూసుకుని సినిమాను విడుదల చేస్తామని ఇటీవల అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ట్రిపుల్ ఆర్ సినిమా తరువాత మరో మూడు ప్రాజెక్టులకు ఓకే చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్. అందులో కొరటాల శివ, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు ఉన్నారు. వీళ్లలో అందరి కంటే ముందు కొరటాల శివ సినిమా మొదలు కానుంది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దీని కోసం గెటప్ కూడా మార్చేశాడు ఈయన. జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న జోడి.. ఈ సారి అన్ని భాషల వాళ్లను కవర్ చేసేలా కథ రాసుకొని వస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, ఆర్టిస్టులు కూడా ఇందులో నటించబోతున్నారు. దీనికి డైమండ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ప్రతి భాషకు అదే టైటిల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేవలం ఆరు నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు కొరటాల శివకు ఎన్టీఆర్ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే మిగిలిన సినిమాలకు కూడా డేట్స్ ఇవ్వాలి కాబట్టి ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నాడు. రాజకీయ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుందని.. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి సంఘ నాయకుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు కొరటాల శివ. ఇది పూర్తయిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై ఫోకస్ చేయనున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Lobo: లోబో, ఉమా దేవిల మధ్య లవ్ ట్రాకా.. ఏం జరుగుతుంది?
బిగ్ బాస్ వేదికగా షణ్ముఖ్‌పై తన ప్రేమను వ్యక్తపరిచిన దీప్తి
Maestro Review: మాస్ట్రో రివ్యూ.. ఆకట్టుకున్న క్రైమ్ థ్రిల్లర్
Bigg Boss: బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టను, ఎవరికి సపోర్ట్ చేయనన్న హాట్ యాంకర్