Bigg Boss: బిగ్ బాస్లోకి అడుగుపెట్టను, ఎవరికి సపోర్ట్ చేయనన్న హాట్ యాంకర్

బిగ్ బాస్ షో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోలో పాల్గొనాలని చాలా మంది అప్కమింగ్ ఆర్టిస్ట్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే బుల్లితెర హాట్ హీరోయిన్ విష్ణు ప్రియ తాను బిగ్ బాస్ హౌజ్లోకి అడుగుపెట్టను, అందులో ఎవరికి సపోర్ట్ చేయను అంటూ ఖరాఖండీగా చెప్పేసింది. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా, అందులో ఈ విషయాలు తెలియజేసింది.
విష్ణు ప్రియా… పోవే పోరా షోతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. ఎన్నో సినిమాలలో నటించిన ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు లభించలేదు. ఈ మధ్య హాట్ షోస్తో ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతున్న ఈ అమ్మడు బిగ్ బాస్ హౌజ్లో అడుగుపెట్టనుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించింది.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్లో ఉన్న షణ్ముఖ్ జస్వంత్ కెరీర్ , తన కెరీర్ ఒకేసారి మొదలయ్యాయని చెబుతూ… షణ్ముఖ్ చాలా మంచివాడని, జెన్యూన్ పర్సన్ అని చెప్పుకొచ్చింది. ఎవరూ సపోర్ట్ చేయకున్నా సొంతంగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఎదిగాడని మెచ్చుకుంది.అలానే అతనికి మంచి జరగాలని పేర్కొంది. బిగ్ బాస్ షోని నేను చూడను, అందుకే ఎవరికి సపోర్ట్ చేయను. బిగ్ బాస్ కాన్సెప్ట్ కూడా నాకు నచ్చదు. అందుకే ఆ షోలో అడుగు కూడా పెట్టనని పేర్కొంది విష్ణు ప్రియ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bigg boss
- tv show
- Vishnu Priya
RELATED ARTICLES
తాజా వార్తలు
Telangana RTC Union Elections | తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ ఘన విజయం
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

