e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home News Lobo: లోబో, ఉమా దేవిల మ‌ధ్య ల‌వ్ ట్రాకా.. ఏం జ‌రుగుతుంది?

Lobo: లోబో, ఉమా దేవిల మ‌ధ్య ల‌వ్ ట్రాకా.. ఏం జ‌రుగుతుంది?

బిగ్ బాస్ హౌజ్‌లో స‌రికొత్త ల‌వ్ ట్రాక్స్ న‌డుస్తున్నాయి. గురువారం రోజు ల‌హ‌రి గిన్నెల క‌డుగుతుంటే ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లిని మాన‌స్ ప్రేమ‌గా మాట్లాడుతూ క‌నిపించాడు. ఇక బెడ్ ద‌గ్గ‌ర ఇద్ద‌రు టైట్ హ‌గ్గులిచ్చుకున్నారు. త‌ర్వాతిరోజు ల‌హ‌రి చేతులు ప్రెస్ చేశాడు మాన‌స్‌.ఇదొక ల‌వ్ ట్రాక్ అయితే ఉమా, లోబోల రొమాన్స్‌ చూడలేకపోయారు హౌస్‌మేట్స్‌.

ఉమా, లోబో ఎదురెదురుగా కూర్చొని తెగ ప్రేమించుకోవ‌డం మొద‌లు పెట్టేశారు. మొద‌ట వీరిద్ద‌రి చూసిన అనీ మాస్ట‌ర్ ఇదెక్క‌డి ల‌వ్ ట్రాక్. చాలా కొత్త‌గా ఉంద‌ని చెప్పింది. ఆ త‌ర్వాత అక్క‌డికి వ‌చ్చిన ర‌వి… మీది యాక్టింగ్‌ అని తెలిసిపోతుంది, కొంచెం మంచిగా న‌టించండి అని చెప్పాడు. ఇక కొద్ది సేపు ష‌ణ్ముఖ్‌ని కూడా ఆట ప‌ట్టించాడు ర‌వి. హౌస్‌లో హమీదా స్మార్ట్‌, హాట్‌, క్యూట్‌, ఇంటెలిజెంట్‌ అని నాతో అన్నావ్‌ కదా అని అంద‌రి ముందు చెప్ప‌డంతో ఆమె ఫుల్ ఖుష్ అయింది.

- Advertisement -

అయితే ష‌ణ్ముఖ్ ఇప్ప‌టికే దీప్తి ప్రేమ‌లో ఉండ‌గా, హ‌మీదా కూడా త‌న‌ని యాక్సెప్ట్ చేయ‌మ‌ని కోరింది. కావాలంటే బయటకెళ్లాక మళ్లీ దీప్తి పేరు రాసుకోమని సలహా ఇవ్వడంతో అక్కడున్న రవి, లహరి నోరెళ్లబెట్టారు. అయితే చివర్లో మాత్రం ఫ్రెండ్‌షిప్‌ అంటూ కవర్‌ చేసింది హమీదా. ఇక సింగిల్ బెడ్ కోసం ఉమ ,లోబోకు టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. వీళ్లిద్దరిలో ఎవరు ఎక్కువ నవ్విస్తే వాళ్లకు ఆ బెడ్‌ సొంతమని చెప్పాడు.

ప్రియాంక సాయం తీసుకున్న లోబో బాగా న‌వ్వించాడు. ఉమా, సిరి చేసిన స్కిట్ కంటే లోబో, ప్రియాంక చేసిన స్కిట్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో లోబోని విజేత‌గా ప్ర‌క‌టించారు. అయితే ఇది నా పొట్టికి(ఉమాదేవి) ఇచ్చేస్తున్నా అని అంద‌రి ముందు చెప్పాడు. ఆమెకు నుదుటి మీద తెగ ముద్దులు కూడా ఇచ్చేస్తున్నాడు. ఇది చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement