బాహుబలి(Baahubali) సినిమా తర్వాత రాజమౌళి (Rajamouli) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ జక్కన్న భారీ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది.
నవంబర్లో చిత్రం నుండి టీజర్ విడుదల కానున్నట్టు తెలుస్తుండగా, ఇక్కడ నుండి ప్రమోషన్ని వేగవంతం చేయనున్నారట. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్తోచిత్రంపై మరింత అంచనాలు పెంచేందుకు ఈ వేడుకను దుబాయ్లో ప్లాన్ చేసే విధంగా చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తుందట. ఇందుకు సంబంధించి పూర్తి క్లారిటీ రావలసి ఉంది. అన్ని సినిమాల మాదిరిగానే కాకుండా.. ఆర్ఆర్ఆర్(RRR) ప్రమోషన్స్ అన్ని భాషల్ని కవర్ అయ్యేలా చేస్తూ ప్రచారం చేయాలని భావిస్తున్నారట జక్కన్న. కేవలం సినిమా పబ్లసిటీకే భారీగా బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని పదుల కోట్లు కేవలం పబ్లిసిటీకి ఖర్చు చేయబోతున్నారని టాక్ వినిపినిస్తోంది.
ఇవి కూడా చదవండి