RRR: ఆర్ఆర్ఆర్ అభిమానులకి గుడ్ న్యూస్.. ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడో తెలుసా?

రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr) హీరోలుగా.. భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). పీరియాడికల్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదీన విడుదల చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదలకు సంబంధించిన అప్డేట్ని ఇస్తామని తెలిపిన టీమ్.. ఊహించని పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా తెలిపారు.
తాజాగా గ్లింప్స్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. నవంబర్ 1న ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ విడుదల కానుందని పేర్కొన్నారు.ఇది ప్రేక్షకుల అంచనాలు రెట్టింపు చేసే విధంగా ఉంటుందట. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా.. గిరిజన వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ సినిమా నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ ను బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకుంది.
ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను ఎన్టీఆర్, రామ్ చరణ్ పూర్తి చేశారట. ఎన్టీఆర్.. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చెప్పుకున్నాడట. ఇటు రామ్ చరణ్.. తెలుగు, హిందీ, తమిళంలో మాత్రమే తన క్యారెక్టర్‌కు తానే డబ్బింగ్ చెప్పినట్టు సమాచారం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- NTR
- Rajamouli
- ram charan
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

