పవన్ కళ్యాణ్‌ను ఫస్ట్ టైం పవర్ స్టార్ అని ఎవరు పిలిచారో తెలుసా !

power star pawan kalyan and posani krishna murali | చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చి తక్కువ సమయంలోనే అన్నకు తగ్గ తమ్ముడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. అన్నయ్య మెగాస్టార్ అయితే.. తమ్ముడు పవర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన క్రేజ్‌తో.. ఫ్యాన్ ఫాలోయింగ్‌లో ఇప్పుడు అన్నయ్యనే మించిపోయాడు. ఫ్లాపులు వచ్చినా క్రేజ్ తగ్గని హీరోగా మారాడు. టాలీవుడ్లో ఒక శిఖరంలా ఎదిగాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో అంతటి స్టార్డమ్ సంపాదించిన పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు ఎవరు ఇచ్చారు? పవన్‌ను ఫస్ట్ టైం పవర్ స్టార్ అని ఎవరు పిలిచారు? దాని వెనుకున్న ఇంట్రెస్టింగ్ కథ ఏంటో తెలుసా!

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా వచ్చింది. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద యావరేజ్‌గా నిలిచింది. దీంతో పవన్ రెండో సినిమాను పకడ్బందీగా ప్లాన్ చేశాడు మెగాస్టార్. ఆ టైంలో పవిత్ర బంధం, హిట్లర్ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న ముత్యాల సుబ్బయ్యను రంగంలోకి దించాడు. పవన్, ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్లో గోకులంలో సీత సినిమా వచ్చింది. తమిళంలో సూపర్ హిట్ అయిన గోకులతై సీతై సినిమాకు ఇది రీమేక్. తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో పవన్ కళ్యాణ్ తొలి హిట్ అందుకున్నాడు. అయితే గోకులంలో సీత సినిమాకు పోసాని కృష్ణమురళి ( posani krishna murali ) మాటలు రాశాడు. ఈ సినిమాకు పనిచేసిన సమయంలో పవన్ కళ్యాణ్‌ను చూసిన పోసాని.. పవర్ స్టార్ పేరు ఆయనకు సరిగ్గా సరిపోతుందని అనుకున్నాడు. ఇదే విషయాన్ని గోకులంలో సీత సినిమా విడుదల సందర్భంగా పోసాని చెప్పాడు.
గోకులంలో సీత సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ అవుతాడని అన్నారు. ఆ తర్వాత చాలా పత్రికలు పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదును చేర్చాయి. పోసాని చెప్పినట్టుగానే గోకులంలో సీత సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఆయన్ను పవర్ స్టార్ అని పిలవడం మొదలుపెట్టారు. తర్వాతి సినిమాలకు కూడా పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ అని టైటిల్ కార్డు వేయడం మొదలైంది. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లో వచ్చిన సుస్వాగతం సినిమాకు తొలిసారిగా పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ అని టైటిల్ కార్డు వేశారు. అలా మొత్తానికి పవన్ కళ్యాణ్‌కు పవర్ స్టార్ అని పేరు రావడానికి కారణం మాత్రం పోసాని కృష్ణమురళినే. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్‌తో పాటు పోసాని కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
power star pawan kalyan | పవన్ సినిమాతో అకీరా నందన్ టాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతున్నాడా..!
power star pawan kalyan | మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

