లండన్: ఓ భారత క్రికెటర్ తనను రిటైర్ కావాలని సూచించినట్లు కరణ్ నాయర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించి దాదాపు ఏడేండ్ల తర్వాత తిరిగి టీమ్ఇండియాకు ఎంపికైన కరణ్.. డెయిలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. ‘నాకు ఇప్పటికీ గుర్తు. సరిగ్గా రెండేండ్ల క్రితం ఓ ప్రముఖ భారత క్రికెటర్ నన్ను రిటైర్ కావాలని సూచించాడు.
తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమన్న అతను.. ఫ్రాంచైజీ టీ20 లీగ్‌ల్లో ఆడటం ద్వారా డబ్బులు సంపాదించవచ్చన్నాడు. కానీ ఆదాయం కోసం ఆలోచించలేదు. తిరిగి ఎలాగైనా భారత్‌కు ఆడాలన్న కసితో మళ్లీ దేశవాళీ బాటపట్టాను. నన్ను నేను నిరూపించుకుంటూ దేశవాళీ టోర్నీల్లో రాణించడం ద్వారా టెస్టు జట్టులోకి వచ్చాను’ అని అన్నాడు.