Sania Mirza | ఇటీవలే మూడో పెండ్లి చేసుకున్న తన మాజీ భర్త షోయభ్ మాలిక్ అటు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో క్రికెట్ ఆడటంతో పాటు కొత్త భార్యతో ఎంజాయ్ చేస్తుంటే భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా మాత్రం సోషల్ మీడియాలో తనకు తాను ధైర్యం చెప్పుకుంటోంది. గత నెలలో మాలిక్.. మీర్జాతో 14 ఏండ్ల పెండ్లి బంధాన్ని తెంచుకుని పాక్ వర్ధమాన నటి సనా జావేద్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే. మాలిక్‌తో విడిపోయినప్పట్నుంచి తన వ్యక్తిగత జీవితం గురించి ఇంతవరకూ స్పందించని సానియా.. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ ఆసక్తికర పోస్టులు పెడుతోంది.
తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా సానియా మీర్జా స్పందిస్తూ… ‘కొన్నిరోజులు ఆమె పోరాట యోధురాలు. కొన్నిరోజులు ఆమె మనసు విరిగిన మనిషి. ఎక్కువరోజులు ఆమె ఈ రెండూ కలిగి ఉంటుంది. కానీ ఆమె ప్రతిరోజూ అక్కడ ఉంది. ఆమె పరిస్థితులను ఎదుర్కుంటూ నిలబడుతుంది. పోరాడుతుంది.. ప్రయత్నిస్తూనే ఉంటుంది.. ఆమెను నేనే..‘ అని రాసుకొచ్చింది.
Sania Mirza Insta Story
షోయభ్ మాలిక్ పెండ్లి తర్వాత అతడు క్రికెట్ బిజీలో మునిగిపోయి పాత జ్ఞాపకాలేవీ దరిచేరనీయడం లేదు. కానీ సానియా మాత్రం ప్రొఫెషనల్ టెన్నిస్‌కు ఎప్పుడో దూరమైంది. ప్రస్తుతం ఆమె కొడుకుతో కలిసి దుబాయ్‌లో ఉంటుంది.
More power to the fighter in Sania Mirza!#SaniaMirza pic.twitter.com/73z6Mug2oA
— Pakistani Cinema (@PakistaniCinema) February 29, 2024