హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అమర్నాథ్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గెలాక్సీ క్రికెట్ క్లబ్‌కు చెందిన అమర్నాథ్ను హెచ్‌సీఏ నూతన అధ్యక్షుడిగా నియమిస్తూ అంబుడ్స్‌మన్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సురేశ్‌కుమార్ కైత్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గెలాక్సీ క్రికెట్ క్లబ్‌కు చెందిన అమర్నాథ్ను హెచ్‌సీఏ నూతన అధ్యక్షుడిగా నియమిస్తూ అంబుడ్స్‌మన్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సురేశ్‌కుమార్ కైత్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ అమర్నాథ్ కోర్టును ఆశ్రయించారు.
హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో జగన్మోహన్రావు చేతిలో ఒక ఓటు తేడాతో అమర్నాథ్ ఓటమిపాలయ్యారు. అయితే నిబంధనలు ఉల్లంఘిస్తూ శ్రీచక్ర క్లబ్ నుంచి జగన్మోహన్ ఎంపిక కావడంపై కోర్టు తీర్పును అనుసరించి రెండో స్థానంలో నిలిచిన అమర్నాథ్ను హెచ్‌సీఏ చీఫ్‌గా నియమిస్తూ అంబుడ్స్‌మన్ నిర్ణయం తీసుకున్నారు.
అంబుడ్స్‌మన్ సురేశ్‌కుమార్ ఆదేశాలకు అనుగుణంగా అమర్నాథ్ సోమవారం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. చాలా రోజుల వరకు అధ్యక్ష పదవి ఖాళీగా ఉండరాదన్న ఉద్దేశంతో అంబుడ్స్‌మన్ సురేశ్‌కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా అమర్నాథ్ పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

