Amanjot Kaur : వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పిన క్యాచ్‌తో వైరలవుతోంది అమన్‌జోత్ కౌర్ (Amanjot Kaur). మెగా టోర్నీలో ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న కౌర్ తమ కుటుంబంలో విషాదం నెలకొందనే వార్తలకు చెక్ పెట్టింది. వరల్డ్ కప్ సమయంలో తమ నానమ్మ చనిపోయిందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అసత్యమని చెప్పిందీ ఆల్‌రౌండర్. మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన తను.. తమ నానమ్మ బతికే ఉందని, ఆమె ఆరోగ్యం కూడా బాగుందని స్పష్టం చేసింది.
‘హలో మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మా 90ల చిన్నారి (నానమ్మ) భగవంతి కౌర్ ప్రాణాలతోనే ఉంది. పూర్తి ఆరోగ్యంతో చక్కగా ఉంది తను. మా నానమ్మ గురించి సోషల్ మీడియాలో వ్యాప్తి అవుతున్న తప్పుడు వార్తలను దయచేసి నమ్మకండి. ఆమె పట్ల, మా కుటుంబం పట్ల మీరు చూపించిన ప్రేమ, దయకు ధన్యవాదాలు’ అని అమన్‌జోత్ వెల్లడించింది.
ఆల్‌రౌండర్‌గా ప్రపంచ కప్ స్క్వాడ్‌కు ఎంపికైన ఈ పంజాబీ అమ్మాయి అందుకు నూరుపాళ్లు న్యాయం చేసింది. ఏడు మ్యాచుల్లో 146 పరుగులు చేసిన తను.. ఆరు వికెట్లు తీసింది. లోయర్ ఆర్డర్లో కీలకమైన రన్స్ చేసిన కౌర్.. ఫైనల్లో మాత్రం సూపర్ క్యాచ్ అందుకుంది. భారత్ నిర్దేశించిన 299 పరుగుల సెంచరీతో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్డ్త్ (Laura Wolvaardt) గుబులు రేపింది.
An excellent effort from Amanjot Kaur has Laura Wolvaardt walking back to the dugout after anchoring the chase 🔥
Watch the #INDvSA Final LIVE in your region, #CWC25 broadcast details here 👉 https://t.co/MNSEqhJhcB pic.twitter.com/M9G7BIi0Bq
— ICC Cricket World Cup (@cricketworldcup) November 2, 2025
సెంచరీ తర్వాత ఆమె దీప్తి శర్మ ఓవర్లో సిక్సర్‌కు యత్నించగా.. పరుగెత్తుతూ వచ్చిన కౌర్ క్యాచ్‌ను ఒడిసిపట్టుకుంది. అంతే.. మ్యాచ్ పూర్తిగా టీమిండియా చేతిలోకి వచ్చింది. వరల్డ్ కప్‌లో గొప్ప ప్రదర్శన చేసిన అమన్‌జోత్‌కు ప్రోత్సాహకంగా రూ.11 లక్షలు ఇస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ది కూడా పంజాబే కావడంతో ఆమెకు కూడా రూ.11 లక్షలు ఇవ్వనుంది సర్కార్.
#WATCH | Mohali, Punjab | On the Indian cricket team winning the ICC Women’s World Cup 2025, Indian cricketer Amanjot Kaur’s grandfather, Ifher Singh, says, “Yes, we watched the full match till 2 am in the night. We felt great to see where our child has reached… We are very… pic.twitter.com/8K4KihbmpY
— ANI (@ANI) November 3, 2025