INDW vs SLW : వరల్డ్ కప్ ఆరంభ పోరులో కష్టాల్లో పడిన భారత జట్టు అనూహ్యంగా పుంజుకుంది. అమన్‌జోత్ కౌర్ (50 నాటౌట్), దీప్తి శర్మ(38 నాటౌట్)లు కీలక భాగస్వామ్యంలో జట్టు స్కోర్ 200 దాటించారు. దాంతో.. టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుండగా మరోసారి ఇన్నింగ్స్‌కు వరుణుడు మరోసారి అడ్డుపడ్డాడు. 40వ ఓవర్ పూర్తికాగానే వర్షం మొదలైంది. దాంతో.. ఇరుజట్ల ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌కు పరుగులు తీశారు.
టాపార్డర్ వైఫల్యంతో కష్టాల్లో పడిన భారత జట్టు ఒకదశలో 120-3తో పటిష్టంగా కనిపించింది. కానీ, ఇనొకా రణవీర ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో 124-5 కు చేరింది. ఆ మరసటి ఓవర్లో రీచా ఘోష్(2) సైతం డియోల్ మాదిరిగానే కవర్స్‌లో ఆడబోయి చేతికి క్యాచ్ ఇచ్చింది. అంతే.. చూస్తుండగానే ఆరు వికెట్లు పడ్డాయి.
Maiden ODI Half-century for Amanjot Kaur and what a time to bring it up! 👏👏
2⃣0⃣0⃣ up for #TeamIndia!
Updates ▶️ https://t.co/m1N52FKTWT#WomenInBlue | #CWC25 pic.twitter.com/ZiZ0V93WIZ
— BCCI Women (@BCCIWomen) September 30, 2025
టెయిలెండర్లతో కలిసి దీప్తి శర్మ జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించే బాధ్యత తీసుకుంది. అమన్‌జోత్ కౌర్ (50 నాటౌట్) .. కవిష ఓవర్లో సిక్సర్‌తో జట్టు స్కోర్ 170 దాటించింది. వీలుచిక్కినప్పుడల్లా బౌడరీలు బాదుతూ.. వీరిద్దరూ 78 బంతుల్లో 86 పరుగుల జోడించారు. దాంతో, భారత్ 40 ఓవర్లకు 210 రన్స్ చేయగలిగింది.