చండీఘడ్: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నేత అమన్ అరోరా(Aman Arora)ను నియమించారు. ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ సింగ్ ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన స్థానంలో అమన్ అరోరా ఆ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా అమన్షేర్ సింగ్ షెర్రీ కల్సిని ప్రకటించారు. సీఎం భగవంత్ మాన్ స్వయంగా అరోరా పేరును పార్టీ చీఫ్గా ప్రకటించారు. పంజాబ్ మంత్రిగా ఉన్న అరోరాను పార్టీ అధ్యక్షుడిగా చేయాలని చాన్నాళ్లుగా వర్క్ జరుగుతోంది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఆప్ పార్లమెంటరీ స్థాయి కమిటీ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ਅੱਜ ਮੈਂ ਪਾਰਟੀ ਪ੍ਰਧਾਨ ਦੀ ਜ਼ਿੰਮੇਵਾਰੀ ਆਪਣੇ ਦੋ ਕਰੀਬੀ ਸਾਥੀ ਕੈਬਿਨੇਟ ਮੰਤਰੀ ਅਮਨ ਅਰੋੜਾ ਅਤੇ ਵਿਧਾਇਕ ਅਮਨਸ਼ੇਰ ਸਿੰਘ ਸ਼ੈਰੀ ਕਲਸੀ ਨੂੰ ਸੌਂਪ ਦਿੱਤੀ ਹੈ। ਪਾਰਟੀ ਨੇ ਫ਼ੈਸਲਾ ਕੀਤਾ ਹੈ ਕਿ ਅਮਨ ਅਰੋੜਾ ਪਾਰਟੀ ਪ੍ਰਧਾਨ ਅਤੇ ਸ਼ੈਰੀ ਕਲਸੀ ਵਰਕਿੰਗ ਪ੍ਰੈਜ਼ੀਡੈਂਟ ਦੇ ਤੌਰ ‘ਤੇ ਕੰਮ ਕਰਨਗੇ। ਮੈਨੂੰ ਆਪਣੇ ਦੋਵਾਂ ਸਾਥੀਆਂ ‘ਤੇ ਪੂਰਾ ਭਰੋਸਾ ਹੈ… pic.twitter.com/EUWXCTddpi
— Bhagwant Mann (@BhagwantMann) November 22, 2024
హిందువు అయిన అరోరా.. పంజాబ్లోని హిందూ ఓటర్లను ఆకర్షిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని ఉన్నట్లు ఇటీవల సీఎం భగవంత్ మాన్ తెలిపారు. 2019 నుంచి పార్టీ అధ్యక్ష పదవి ఆయన వద్దే ఉన్నది. సంస్థాగత నైపుణ్యం, సామర్థ్యం ఉన్న వ్యక్తుల్లో అరోరా ఒకరు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్న బాధ్యతలను ఆయనకు అప్పగించారు.