Alyssa Healy : ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్లో భారత స్టార్ జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues) క్యాచ్ వదిలేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ (Alyssa Healy ) ఈసారి ఏ పొరపాటు చేయలేదు. డీవై పాటిల్ స్టేడియంలో జెమీమా క్యాచ్ వదిలేసి జట్టు ఓటమికి కారణమైన తను స్వదేశంలో మాత్రం సూపర్‌గా అందుకుంది. మహిళల బిగ్‌బాష్ లీగ్(WBBL)లో సిడ్నీ సిక్సర్స్‌కు ఆడుతున్న హీలీ వికెట్ల మందుకు పరుగెడుతూ వచ్చి చక్కని క్యాచ్ పట్టింది. పట్టుకుంది. ఆ క్యాచ్ అందుకున్న తర్వాత కోపంగానే బంతిని నేలకు విసిరేసిన ఆమెను సహచరులు అభినందించారు.
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో గురువారం సిడ్నీ సిక్సర్స్, హోబర్ట్ హరికేన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. సిడ్నీ పేసర్ లారెన్ చియట్లే వేసిన 12వ ఓవర్లో లిజెల్లే లీ ఆడిన బంతి వికెట్లకు కాస్త దూరంలోనే లేచింది. దాంతో.. గబగబా పరుగుతీసిన హీలీ.. ఒడుపుగా క్యాచ్ అందుకుంది. ఆ తర్వాత కోపంగా ముఖం పెట్టిన తను బంతిని నేలకు విసిరింది. ఈ మ్యాచ్‌లో బ్యాటుతోనూ మెరిసిన ఆమె 37 పరుగులు చేసింది. దాంతో.. ప్రత్యర్ధికి 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది సిడ్నీ. కానీ ఛేదనలోహోబర్ట్ బ్యాటర్లు దంచేయగా 6 వికెట్లతో సిడ్నీ ఓటమిపాలైంది.
Judging by that reaction…
Alyssa Healy exorcised some World Cup demons with this catch 😅#WBBL11 #CWC25 pic.twitter.com/nttq0MkMxG
— Weber Women’s Big Bash League (@WBBL) November 13, 2025
భారత జట్టుతో జరిగిన సెమీఫైనల్లో జెమీమా అర్ధ శతకం బాది సెంచరీకి చేరువవుతోంది. ఆ సమయంలో అలనా కింగ్ చేతికి బంతి అప్పగించిన హీలి మంచి అవకాశాన్ని నేలపాలు చేసింది. షాట్ ఆడాలనుకున్న జెమీమా అంచనా తప్పి బంతి వికెట్లకు కాస్త దూరంలో గాల్లోకి లేచింది. నేను క్యాచ్ తీసుకుంటా అని పరుగెత్తుకొచ్చిన ఆసీస్ కెప్టెన్ డైవ్ చేసి బంతిని అందుకున్నట్టే అందుకొని వదిలేసింది. అప్పుడు జెమీమా 82 పరుగుల వద్ద ఉంది. లైఫ్ లభించడంతో రెచ్చిపోయిన భారత స్టార్ ప్లేయర్ టెయిలెండర్లతో కీలక పరుగులు రాబట్టింది. అజేయ శతకం బాదిన తను టీమిండియాను ఫైనల్ చేర్చింది.
You might forget her in this celebration, but we won’t. Thanks again Alyssa Healy. ♥️ pic.twitter.com/j85MhF0ZjW
— Silly Point (@FarziCricketer) October 30, 2025