హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ మరో మేజర్ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. ఈ నెల 10 నుంచి 13 వరకు సికింద్రాబాద్ క్లబ్ వేదికగా ఆలిండియా మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ జరుగనుంది. టోర్నీకి సంబంధించిన బ్రౌచర్‌ను హెచ్‌వోటీఏ అధ్యక్షుడు నరసింహారెడ్డి, డీఐజీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. రూ.2లక్షల ప్రైజ్‌మనీ కల్గిన ఈ టోర్నీలో 300 మందికి పైగా ప్లేయర్లు పోటీపడుతున్నారు. 30 నుంచి 70 ఏండ్ల వరకు పలు విభాగాల వారీగా సింగిల్స్, డబుల్స్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఈ నెల 10న అర్హత మ్యాచ్‌లు జరుగుతాయి.