BCCI | అఫ్గనిస్థాన్‌తో టీ20లకు సుందర్ ఫిట్.. బుమ్రాపై నిర్ణయం ఆరోజే..!
BCCI : శ్రీలంక పర్యటనకు దూరమైన భారత క్రికెటర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar) ఫిట్నెస్ సాధించాడు. అఫ్గనిస్థాన్ (Afghanistan)తో జరుగనున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన ఈ స్పిన్ ఆల్‌రౌండర్ ఫిట్నెస్ నిరూపించుకున్నాడు.
BCCI : శ్రీలంక పర్యటనకు దూరమైన భారత క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) ఫిట్నెస్ సాధించాడు. స్వదేశంలో అఫ్గనిస్థాన్ (Afghanistan)తో జరుగనున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన ఈ స్పిన్ ఆల్‌రౌండర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. దాంతో.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో సుందర్ ఆడడం ఖాయమైంది. మరో నాలుగు రోజుల్లో తొలి మ్యాచ్ ఉన్నందున ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ స్పీడ్‌స్టర్ ఫిట్‌నెస్‌పై సెప్టెంబర్ 9వ తేదీ బుధవారం నాడు నిర్ణయం వెలువడనుంది.
అఫ్గనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు మరో నాలుగు రోజులే ఉంది. స్వదేశంలో జరుగుతున్న ఈ సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్ల ఫిట్నెస్ కోసం నిరీక్షిస్తున్న భారత జట్టుకు గుడ్‌న్యూస్. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. గాయంతో శ్రీలంక పర్యటనకు దూరమైన సుందర్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో గట్టెక్కాడు.
Washington Sundar is reportedly fit to play, while Jasprit Bumrah, Harshit Rana, and Nitish Kumar Reddy are yet to obtain their clearance certificates from BCCI’s CoE.#AFGvIND #TeamIndia https://t.co/ktyImdS9Pr
— Circle of Cricket (@circleofcricket) September 8, 2026
అయితే.. ఇప్పటికీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే ఉన్న జస్ప్రీత్ బుమ్రా, పేస్ ఆల్‌రౌండర్లు హర్షిత్ రానా, నితీశ్ కుమార్ రెడ్డిల ఫిట్‌నెస్‌పై స్పష్టత రాలేదు. ఈ ముగ్గురు ఫిట్‌గా ఉన్నారా? లేదా? అనే విషయంపై సెప్టెంబర్ 9న బీసీసీఐ ప్రకటన చేయనుంది. సెప్టెంబర్ 13వ తేదీన కాబూలీలో తొలి టీ20తో సిరీస్ మొదలవ్వనుంది.
భారత స్క్వాడ్: శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), శివం దూబే, నితీశ్ రెడ్డి, అక్షర్ పటేల్, సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, బుమ్రా, అర్ష్‌దీప్, హర్షిత్ రానా.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

