‘ఇందులో నా పేరు సుబ్బలక్ష్మి. అంతా సుబ్బు అని పిలుస్తుంటారు. జడల్ జర్నీలో లవ్ పార్టనర్‌గా కనిపిస్తాను. అలాగే నాకంటూ ఓ జర్నీ ఉంటుంది. అది చాలా భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లుంటాయి. అవన్నీ బిగ్ స్క్రీన్ మీదే చూడాలి’ అని కథానాయిక కయాదు లోహార్ అన్నారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ‘ది ప్యారడైజ్’ సినిమాలో ఆమె కథానాయిక. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానున్నది. ఈ సందర్భంగా మంగళవారం కయాదు లోహర్ విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు.
‘నాది ఇందులో నటనకు అవకాశం ఉన్న పాత్ర. కథలో కూడా కీలకంగా ఉంటుంది. ఆ పాత్ర గురించి ఇప్పుడే రివీల్ చేయలేను. నాని, శ్రీకాంత్ ఓదెల, అనిరుధ్ లాంటి టీమ్ పనిచేసిన సినిమాలో భాగం కావడం గొప్ప అనుభవం. ‘డ్రాగన్’ చూశాకే ఈ పాత్ర నేను చేయగలనని శ్రీకాంత్ నమ్మారు. టెస్ట్లుక్ చేసి నన్ను సెలక్ట్ చేశారు.
ఇది నా కెరీర్లోనే పెద్ద ప్రాజెక్ట్’ అని కయాదు తెలిపారు. జడల్‌గా నాని విశ్వరూపాన్ని ఇందులో చూస్తారని, ఆయనలాంటి స్వీట్, హంబుల్ పర్సన్‌తో కలిసి పనిచేయడం అదృష్టమని, శ్రీకాంత్ ఓదెల విజన్ ఉన్న అరుదైన దర్శకుడని, నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారని కయాదు పేర్కొన్నారు.