హైదరాబాద్, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ) : వానకాలం ధాన్యం కొనుగోళ్లను అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభించనున్నట్టు సివిల్సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. మంగళవారం కొనుగోళ్ల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎస్హెచ్టీ(స్టోరేజ్, హమాలీ, ట్రాన్స్పోర్ట్) వ్యూహాన్ని పకాగా అమలు చేయనున్నట్టు తెలిపారు. అగ్రిస్టాక్ ఫార్మర్ ఐడీ ఉండాలని స్పష్టంచేశారు. బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 7715 రకాలకు బోనస్ వర్తిస్తుందని పేర్కొన్నారు.