IND vs UAE : పదిహేడో సీజన్ ఆసియా కప్‌ను భారత జట్టు అదిరపోయేలా ఆరంభించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో దడ పుట్టిస్తూ యూఏఈ(UAE)కి ముచ్చెమటలు పట్టించిన టీమిండియా.. ప్రత్యర్థులకు వణుకు పుట్టించే విజయంతో టోర్నీలో ఘనంగా శుభారంభం చేసింది. తొలుత కుల్దీప్ యాదవ్ (4-7), శివం దూబే(4-3)ల విజృంభణతో ప్రత్యర్థి 57కే పరిమితం అవ్వగా.. స్వల్ప ఛేదనలో ఓపెనర్ అభిషేక్ శర్మ(30) సిక్సర్లతో చెలరేగాడు. శుభ్‌మన్ గిల్(19 నాటౌట్) సైతం దంచేయడంతో… 4.3 ఓవర్లలోనే జయభేరి మోగించింది. 9 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా గ్రూప్ ఏ నుంచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఆసియా కప్‌ను భారీ విజయంతో మొదలు పెట్టింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థికి దిమ్మతిరిగే షాకిచ్చింది. 58 పరుగుల ఛేదనలో ఓపెనర్ అభిషేక్ శర్మ తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత బంతికి ఫోర్ బాదగా.. రెండో ఓవర్లో శుభ్‌మన్ గిల్(19 నాటౌట్) ఫోర్, సిక్సర్ కొట్టడంతో చూస్తుండానే లక్ష్యం కరిగిపోయింది.
A dominating show with the bat! 💪
A 9⃣-wicket win for #TeamIndia after chasing down the target in 4.3 overs. 👏👏
Scorecard ▶️ https://t.co/Bmq1j2LGnG#AsiaCup2025 | #INDvUAE pic.twitter.com/ruZJ4mvOIV
— BCCI (@BCCI) September 10, 2025
జునైద్ సిద్దిఖీ వేసిన నాలుగో ఓవర్లో సిక్సర్ రాబట్టిన అభిషేక్.. ఆ తర్వాత బంతికి ఔటయ్యాడు. అతడు వెనుదిరిగే సరికి టీమిండియా స్కోర్.. 48/1. విజయానికి పది పరుగులు మాత్రమే అవసరం కాగా.. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (7 నాటౌట్) ఎదుర్కొన్న మొదటి బంతినే స్టాండ్స్‌లోకి పంపాడు. నాలుగో ఓవర్ మూడో బంతిని గిల్ బౌండరీకి తరలించగా.. యూఏఈ జట్టు దారుణంగా ఓడిపోయింది.
ABHISHEK SHARMA – HIT THE FIRST BALL OF THE INNINGS FOR A SIX. 🤯 pic.twitter.com/4sWr6hOLl0
— Johns. (@CricCrazyJohns) September 10, 2025
టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న టీమిండియా యూఏఈని స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. మొదట ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓపెనర్ అలీషాన్ షరుఫు(22)ను ఔట్ చేసి జట్టుకు తొలి వికెట్ అందించాడు. దూకుడుగా ఆడుతున్న అతడిని యార్కర్ కింగ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో.. 26వద్ద ఆతిథ్య జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. కాసేపటికే బంతి అందుకున్న వరుణ్ చక్రవర్తి ముహమ్మద్ జొహైబ్(2)ను డగౌట్ చేర్చాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ (4-7), శివం దూబే(4-3)లు మ్యాజిక్ చేశారు.
𝙄𝙣𝙣𝙞𝙣𝙜𝙨 𝘽𝙧𝙚𝙖𝙠!
Stunning bowling display from #TeamIndia! 🔥
4⃣ wickets for Kuldeep Yadav
3⃣ wickets for Shivam Dube
1⃣ wicket each for Varun Chakaravarthy, Axar Patel & Jasprit BumrahScorecard ▶️ https://t.co/Bmq1j2LGnG#AsiaCup2025 | #INDvUAE pic.twitter.com/cvs2anfip6
— BCCI (@BCCI) September 10, 2025
చైనామన్ బౌలర్ కుల్దీప్ విజృంభణతో… 9వ ఓవర్లో రాహుల్ చోప్రా(3), కెప్టెన్ ముహమ్మద్ వసీం(19), హర్షిత్ కౌశిక్(2)లు వెనుదిరిగారు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే అక్షర్ పటేల్(13-1), దూబేలు మరో ఎండ్ నుంచి వికెట్ల వేట సాగించారు. 13వ ఓవర్లో రెండు వికెట్లు తీసిన దూబే ప్రత్యర్థిని ఆలౌట్ అంచున నిలిపాడు. చివరి వికెట్‌గా వచ్చిన హైదర్ అలీ(1)ని కుల్దీప్ ఔట్ చేయగా 57కే యూఈఏ ఇన్నింగ్స్ ముగిసింది.