హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఆలిండియా ప్రిజన్స్ డ్యూటీ మీట్‌కు మంగళవారం తెరలేవనుంది. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా సోమవారం పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు ఆమె తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్(బీపీఆర్‌అండ్‌డీ)ఈ క్రీడా పోటీలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
డ్యూటీ మీట్లో 21 రాష్ర్టాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1,300 మందికి పైగా జైలు సిబ్బంది 36 విభాగాల్లో పోటీపడుతున్నారు. అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్, కరాటే లాంటి క్రీడాపోటీలతో పాటు సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, సాంస్కృతిక పోటీలు ఉంటాయని తెలిపారు.