హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆల్ఇండియా మహిళల ఇంటర్ యూనివర్సిటీ టెన్నిస్ టోర్నీలో ఉస్మానియా యూనివర్సిటీ జట్టు టైటిల్‌తో మెరిసింది. సోమవారం మణిపాల్ యూనివర్సిటీ వేదికగా జరిగిన ఫైనల్లో ఓయూ 2-1తో మద్రాస్ యూనివర్సిటీపై విజయం సాధించింది. తొలుత జరిగిన సింగిల్స్‌లో శ్రీమన్యరెడ్డి 6-2, 0-6, 3-6తో లక్ష్మిప్రభ చేతిలో ఓడింది.
మరో సింగిల్స్‌లో సామా చెవికారెడ్డి 6-2, 6-4తో అభిజ్ఞపై గెలిచింది. డబుల్స్‌లో ఓయూ ద్వయం సౌమ్య, చెవికారెడ్డి 12-10, 6-2తో లక్ష్మి ప్రభ, అనన్యపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకున్నారు. ఇటీవల జరిగిన సౌత్‌జోన్ టోర్నీతో పాటు ఆల్ఇండియా టోర్నీలో ఓయూ ప్లేయర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు.