Imane Khelif : ఒలింపిక్స్‌లో పసిడి గెలుపొందిన వివాదాస్పద బాక్సర్ ఇమనె ఖెలిఫ్ (Imane Khelif)కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. బాక్సింగ్‌లో అల్జీరియా(Algeria)కు తొలి స్వర్ణం అందించిన ఆమెకు అభిమానులు నీరాజనాలు పలికారు. ఆమె పుట్టి పెరిగిన లగౌట్(Laghout) నగరంలోని ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇమనెకు వెల్కమ్ చెప్పారు. అక్కడ ఓపెన్ టాప్ బస్సులో ఇమనె విజయ సంకేతం చూపిస్తూ ఊరేగింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.
నిరుడు ప్రపంచ చాంపియన్‌షిప్స్ ముందు నిర్వహించిన ‘లింగ పరీక్ష'(Gender Test)లో ఇమనె ఫెయిల్ అయింది. ఆమెలో టెస్టోస్టిరాన్ హార్మోన్ లక్షణాలు అధికంగా ఉండడంతో అమ్మాయిల విభాగంలో పోటీ పడేందుకు నిర్వాహకులు అనుమతించలేదు. కానీ, ఐఓసీ(IOC) మాత్రం ఖెలెఫ్ను పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఒలింపిక్స్‌లో 66 కిలోల విభాగంలో పోటీ పడిన ఇమనె తొలి బౌట్ నుంచే ప్రత్యర్థులను బెంబేలెత్తించింది. ఏడు అడుగుల ఎత్తు ఉండే ఇమనె పంచ్ ధాటికి రింగ్‌లో ఎవరూ నిలువలేకపోయారు. అయితే.. 16వ రౌండ్ మ్యాచ్‌లో ఇమనె ఖెలిఫ్ కేవలం 46 సెకన్లలోనే ఇటలీ బాక్సర్‌ను యాంజెల కరిని (Angela Carini)ని ఓడించింది.
దాంతో, రింగ్‌లో తనను ఓ అబ్బాయి కొడుతున్నాడని, ఖెలిఫ్ అమ్మాయి కాదని యాంజెల వాపోయింది. అంతేకాదు ఇక తాను ఫైట్ చేయలేనంటూ ఆమె వైదొలిగిన విషయం తెలిసిందే. ఫైనల్లో ఇమనె చైనా బాక్సర్ యాంగ్ లీను ఓడించి బంగారు పతకం కొల్లగొట్టింది.
విశ్వ క్రీడల బాక్సింగ్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన ఇమనె ఆ తర్వాత కొత్త లుక్‌లో దర్శనమిచ్చింది. ‘పురుష బాక్సర్’ నిందను పోగొట్టుకునేందుకు ఈ అల్జీరియా బాక్సర్ ఓ వీడియో పెట్టింది. అందులో ఆమె అచ్చం అమ్మాయిని తలపించేలా ఉంది. ఆ వీడియోలో ఇమనెను చూసినవాళ్లంతా అవును కదా.. ‘అమ్మాయే’ అని అనకమానరు.
The streets were filled with cheering crowds as Imane Khelif, the Paris 2024 gold medalist, arrived home to celebrate her monumental achievement 🇩🇿🥇#ImaneKhelif #algerians #Olympics pic.twitter.com/MktQ9KiO7s
— Smashi Sports (@SmashiSports) August 18, 2024
రింగ్‌లో అబ్బాయిలా పంచ్‌లు కురిపించిన ఆమె.. తన లుక్‌తో అందర్నీ ఫిదా చేసింది. పూల డిజైన్లతో కూడిన డ్రెస్ ధరించి మెడలో ఒలింపిక్ స్వర్ణాన్ని వేసుకొని ఇమనె ఓ నవ్వు విసురుతూ కెమెరాకు ఫోజిచ్చింది.
Algerian boxer Imane Khelif shows off dramatic new feminine makeover, days after winning gold at the Paris Olympics. pic.twitter.com/6nlFR9HSJr
— Oli London (@OliLondonTV) August 15, 2024
నిండైన జట్టును నుదిటికి ఇరువైపలా విప్పారదీసి.. చెవులకు పూల కొమ్మల్లాంటి జుంకాలతో ఇమనె చాలా స్టయిలిష్‌గా ఉంది. తనపై వస్తున్న వార్తలకు తాజా ఫొటోతో చెక్ పెడుతూ అందర్నీ షాక్‌కు గురి చేసింది ఇమనె.