JK Assembly Polls : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కీలక హామీలతో నేషనల్ కాన్ఫరెన్స్ తన ఎన్నికల మేనిఫెస్టోను సోమవారం విడుదల చేసింది. మేనిఫెస్టోలో 12 గ్యారంటీలకు చోటు కల్పించింది. ఆర్టికల్ 370 పునరుద్ధరణ, 35-ఏ, రాష్ట్ర హోదా వంటి భారీ హామీలను గుప్పించింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
కశ్మీరీ పండిట్లను తిరిగి రప్పించి వారికి పునరావాసం కల్పిస్తామని పేర్కొంది. కేంద్రపాలిత ప్రాంతంలో రాజకీయ, చట్టబద్ధ స్ధితిని పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో తొలి గ్యారంటీగా పేర్కొంది. ఆర్టికల్ 3701, 35ఏ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. రాజకీయ ఖైదీల విడుదల, కశ్మీరీ పండిట్ల పునరావాసం, జాబ్ వెరిఫికేషన్ ప్రక్రియ సులభతరం, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సరళీకరణ సహా పలు హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది.
యువతకు సమగ్ర ఉపాధి ప్యాకేజ్ ప్రకటిస్తామని మూడో గ్యారంటీగా పేర్కొంది. ఇక 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని ఒమర్ అబ్దుల్లా హామీ ఇచ్చారు. మంచినీటి సరఫరా, విద్యుత్ పంపిణీలో సమస్యలను అధిగమిస్తామని తెలిపింది. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని నేషనల్ కాన్ఫరెన్స్ హామీ ఇచ్చింది.
Read More :