గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Sep 12, 2020 , 09:38:33

యూఎస్ ఓపెన్ ఫైన‌ల్‌లో అలెగ్జాండ‌ర్

యూఎస్ ఓపెన్ ఫైన‌ల్‌లో అలెగ్జాండ‌ర్

న్యూయార్క్‌: క‌రోనా మహ‌మ్మారి విజృంభిస్తున్న వేళ జ‌రుగుతున్న యూఎస్ ఓపెన్‌లో మ‌రో సంచ‌ల‌నం న‌మోద‌య్యింది. దాదాపు 26 ఏండ్ల త‌ర్వాత జ‌ర్మ‌నీకి చెందిన ఓ ఆట‌గాడు యూఎస్ ఓపెన్ ఫైన‌ల్‌లో అడుగుపెట్టాడు. న్యూయార్క్‌లో జ‌రిగిన సెమీ ఫైన‌ల్‌లో జ‌ర్మ‌నీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ స్పెయిన్ ఆట‌గాడు ప‌బ్లో కారెనో బ‌స్టాపై విజ‌యం సాధించాడు. మొద‌టి రెండు సెట్ల‌లో త‌డ‌బ‌డిన అలెగ్జాండ‌ర్ త‌ర్వాత వేగం అందుకున్నాడు. దీంతో బ‌స్టాపై 3-6, 2-6, 6-3, 6-4, 6-3తో జ‌య‌కేత‌నం ఎగుర‌వేశాడు.

ఈ విజయంతో 1994 త‌ర్వాత యూఎస్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్‌కు చేరుకున్న మొదటి జర్మన్ ఆట‌గాడిగా జ్వెరెవ్ నిలిచాడు. 1994లో మైఖేల్ స్టిచ్ యూఎస్ ఫైన‌ల్‌లో ఆడాడు. కాగా, ఆదివారం జర‌గ‌నున్న‌ ఫైనల్లో ఐదో సీడ్ జ్వెరెవ్ డొమినిక్ థీమ్‌తో త‌ల‌ప‌డ‌నున్నాడు.logo