లండన్: వింబుల్డన్ టోర్నీలో సెమీస్ బెర్తులు ఖాయమయ్యాయి. కెరీర్లో 25వ టైటిల్ వేటలో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఈ టోర్నీ సెమీస్‌కు ప్రవేశించాడు. క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ డి మినార్‌తో తలపడాల్సి ఉన్నా గాయం కారణంగా అతడు తప్పుకోవడంతో రెండో సీడ్ జొకో ఫైనల్-4కు అర్హత సాధించాడు. తొలి సెమీస్ అల్కారజ్ (స్పెయిన్), డేనిల్ మెద్వెదెవ్ మధ్య జరుగనుంది.
మహిళల విభాగంలో నాలుగో సీడ్ ఎలీనా రిబాకినా (కజకిస్థాన్) 6-3, 6-2తో ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)ను ఓడించి సెమీస్ చేరింది. మరో మ్యాచ్‌లో బర్బొర క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) 6-4, 7-6 ((7/4)తో జలెన ఒట్సొపెంకో(లాత్వియ)ను చిత్తుచేసి తొలిసారి వింబుల్డన్ సెమీస్ చేరింది. మొదటి సెమీస్‌లో క్రెజికొవా 2022లో టైటిల్ గెలిచిన రిబాకినాతో ఢీకొననుంది. రెండో సెమీస్ అన్‌సీడెడ్ డొన వెకిచ్ (క్రొయేషియా), జాస్మిన్ పలోని(ఇటలీ) మధ్య జరుగనుంది.